– తల్లులు పిల్లలు క్షేమం
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చొరవ
– కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సౌకర్యాలు కల్పన
– డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు పర్యవేక్షణ
– పేదలకు చేరువలో ప్రభుత్వ వైద్యం
– సూపరింటెండెంట్ డాక్టర్ రాధ రుక్మిణి
నవతెలంగాణ – అశ్వారావుపేట : ప్రాణాపాయం అయితే సరైన వైద్య సౌకర్యాలు లేవు.కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లండి అనే హడావుడి నుండి ఒకే రోజు నలుగురికి చిన్న ఆపరేషన్ చేసి నలుగురు గర్భిణి లకు పురుడు పోసి నవజాత శిశువులు కు జన్మనిచ్చే స్థితికి అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విద్యా వైద్యం మౌళిక సదుపాయాలు కే ప్రాధానత్య ఇవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రులు లో సౌకర్యాల కల్పన కు చొరవ చూపుతున్నారు.అదే క్రమంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సౌకర్యాలు కల్పించడం,డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు పర్యవేక్షణ వెరసి స్థానిక ఏరియా ఆసుపత్రిలో వైద్యసేవలు మెరుగు పడుతున్నాయి.
దీంతో ఈ ప్రాంత ప్రజలు అత్యవసర వైద్యానికి అశ్వారావుపేట ఆసుపత్రి తలమానికంగా రూపొందిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏరియా ఆసుపత్రి రోజు రోజుకి రోగులకు దగ్గర అవుతున్న తరుణంలో బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి పర్యవేక్షణ లో గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక లు ఒక్క రోజే నలుగురికి సి.సెక్షన్ ఆపరేషన్ లు చేసి నలుగురు పిల్లలకి పురుడు పోశారు.
అశ్వారావుపేట మండలం దిబ్బ గూడెం కు చెందిన సోయం ధనలక్ష్మి రెండో కాన్పు,అశ్వారావుపేట కు చెందిన పత్తేపరపు నాగ పావని మొదటి కాన్పు,దమ్మపేట మండలం జమేదారు బంజరు కు చెందిన సవలం పద్మజ రెండో కాన్పు,అశ్వారావుపేట బీసీ కాలనీకి చెందిన నెర్సుల దీనమ్మ 3 కాన్పు కోసం వారి బంధువులు ఏరియా ఆసుపత్రి లో చేర్చారు.
వీరిలో నాగ పావని కి కష్టమైన కాన్పు స్థితిలో (బ్రీచ్ ప్రజెంటేషన్ ) ఎదురు కాళ్లతో ఒకరు జన్మనిచ్చారు. పరుడు పోసుకున్న నలుగురి లో ఇద్దరు మగ పిల్లలు,ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.ఈ ఆసుపత్రి లో అందుతున్న వైద్య సేవలకు అశ్వారావుపేట చుట్ట ప్రక్కల గ్రామాల ప్రజలు, మారు మూల గిరిజన గ్రామాల నుండి రోగులు ఈ ఆసుపత్రిని అధిక సంఖ్యలో ఆశ్రయిస్తున్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చుతో కూడుకున్న వైద్యం కావడంతో ఈ ఆసుపత్రిలో ఉచితం గా వైద్యసేవలు అందిస్తున్న ఆసుపత్రి సిబ్బందిని రోగి తాలూకా బంధువులు అభినందిస్తున్నారు. ఈ ఆపరేషన్ లలో ఆసుపత్రి హెడ్ నర్స్ మంగతాయమ్మ,ఆపరేషన్ థియేటర్ నర్సింగ్ ఆఫీసర్ సుజాత,ఎంఎన్ఓ సాంబయ్య,వార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.