- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో, దుబ్బవాడకు చెందిన శ్రీహాస్ (4) అనే బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా, నిషేధిత చైనా మాంజా గొంతుకు చుట్టుకుని తీవ్రంగా గాయపడ్డాడు. మాంజాను తీయబోతుండగా గొంతు తెగి రక్తస్రావమైంది. బాలుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి, గొంతుకు 20 కుట్లు వేశారు. ప్రస్తుతం బాలుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
- Advertisement -



