నవతెలంగాణ-హైదరాబాద్: ఇవాళ భారత్-దక్షణాఫ్రికా మధ్య నాలుగో టీ20 జరగనుంది. కాసేపట్లో లక్నో వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. ఐదు మ్యాచుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే టీమిండియా రెండు మ్యాచులు గెలిచి లీడ్‌లో ఉంది. సఫారీ జట్టు ఒక్క మ్యాచ్ గెలిచింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే టీ20 సిరీస్ భారత్ కైవసం కానుంది.
అంతకుముందు టెస్ట్ సిరీస్‌ను సౌతాఫ్రికా కైవసం చేసుకోగా, వన్డే ట్రోఫీని ఇండియా గెలుచుకుంది. తాజాగా జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ తోపాటు ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరిగిన టోర్నమెంట్‌ల ప్రకారం టీమిండియా ముందంజలో ఉంటుంది.
టీమిండియా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా గత మ్యాచ్ ఆడినే జట్టునే లక్నోలోనూ కొనసాగించనుంది. ఒకవేళ బుమ్రా ఆడకపోతే హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగించనున్నారు. మరోవైపు సౌతాఫ్రికా జట్టులో మరోసారి మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. డేవిడ్ మిల్లర్ తిరిగి జట్టులోకి రానున్నాడు. నేడు జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాలని సఫారీ టీం పట్టుదలతో ఉంది.
తుది జట్లు
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెప్టెన్ ), డికాక్, రిజా హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరిరా, యాన్సెన్, బాష్, జార్జ్ లిండే/కేశవ్, ఎంగిడీ, బార్ట్‌మన్.
భారత్
సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, శుభ్‌మన్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి.



