నవతెలంగాణ – శామీర్ పేట : 10 పదవతరగతి పూర్తిచేసిన విద్యార్థులకు జఠాధరా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్న నీట్ – ఐఐటీ బ్రిడ్జ్ కోర్సు పై అవగాహన సదస్సు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం మూడు చింతలపల్లి కేశవరం గ్రామ పరిధిలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జూనియర్ కళాశాలలో నీట్, ఐఐటి బ్రిడ్జ్ కోర్సులపై పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు మూడు రోజులపాటు జరిగే అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచితంగా అందించే ఈ బ్రిడ్జి కోర్సు ను విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. విద్యార్థులకు ఈ కోర్సు తమ నైపుణ్యాలు పెంపొందించేందుకు దోహద పడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ రవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కోర్సులు సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి శామీర్ పేట మండలంలోని పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కోర్సు లో చేరుటకు విద్యార్థులు ఫోన్ నెంబర్ 7337285228/ 7416145227 లను పూర్తి వివరాలకు సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సొసైటీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
10వ తరగతి విద్యార్థులకు నీట్.. ఐఐటీ బ్రిడ్జ్ కోర్సు లపై ఉచిత అవగాహన సదస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES