Wednesday, May 7, 2025
Homeతెలంగాణ రౌండప్6 నుండి ఉచిత క్రికెట్ శిబిరాలు

6 నుండి ఉచిత క్రికెట్ శిబిరాలు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి సెయింట్ పాల్స్ హైస్కూల్ మైదానంలో ఈనెల 6 నుండి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం కానున్నట్టు ప్రధాన కోచ్  ఈ నాక్ పాల్ శనివారం తెలిపారు. ఈ శిబిరాన్ని నిజామాబాద్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సహకారంతో నిర్వహించనున్నారు. ఈ శిబిరం క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు, యువతకు అనుభవజ్ఞులైన కోచ్‌ల నుండి ప్రామాణికమైన శిక్షణ పొందే అవకాశం కల్పించనుంది. ప్రాథమిక స్థాయి నుంచీ ఉన్నత స్థాయి క్రికెట్ నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఇది ఒక ఉత్తమ వేదికగా నిలవనుంది అని అన్నారు. జిల్లా క్రికెట్ సంఘంఅధ్యక్షుడు, శ్రీ చంద్రసేన్ రెడ్డి కార్యదర్శి, శ్రీ వెంకట్ రెడ్డి సంయుక్త కార్యదర్శి, శ్రీ సురేష్ సలహాదారు, శ్రీనివాస్ లు పాల్గొంటారని తెలిపారు. క్రికెట్ పట్ల ఆసక్తి కలిగిన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని , క్రికెట్ రంగంలో తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే యువత ఈ శిక్షణ శిబిరం ద్వారా అనుభవజ్ఞులైన కోచ్‌ల మద్దతుతో మెరుగైన ప్రగతిని సాధించవచ్చని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -