Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్గణేశ్‌ మండపాలకు ఫ్రీ కరెంట్‌..

గణేశ్‌ మండపాలకు ఫ్రీ కరెంట్‌..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేశ్‌ ఉత్సవ మండపాలకు ఫ్రీ కరెంట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా వెల్లడించారు.
వినాయక మండపాలకు ఉచిత కరెంట్‌ అందజేయాలని ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులు ఇటీవల మంత్రి నారా లోకేశ్‌ను విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన నారా లోకేశ్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విద్యుత్‌ వాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో చర్చించారు ఈ సందర్భంగా ఉచిత విద్యుత్‌ ఇ చ్చేందుకు వారు అంగీకరించారు. ఈ మేరకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు నారా లోకేశ్‌ తెలిపారు.
గణేశ్‌ మండపాలకే కాకుండా రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గామాత పందిళ్లకు కూడా ఉచిత విద్యుత్‌ అందజేస్తామని నారా లోకేశ్‌ తెలిపారు. వినాయక చవితి, దసరా ఉత్సవాలకు సంబంధించి మండపాలకు ఉచిత విద్యుత్‌ అందజేసేందుకు రూ.25 కోట్లను కూటమి ప్రభుత్వం వెచ్చించనుందని పేర్కొన్నారు. ఇదిలాఉంటే తెలంగాణలో కూడా గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌ అందజేయాలని నిర్ణయించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad