Saturday, February 28, 2026
E-PAPER
Homeజాతీయందేశవ్యాప్తంగా ఉచిత ‘HPV' వ్యాక్సినేషన్ ప్రారంభం

దేశవ్యాప్తంగా ఉచిత ‘HPV’ వ్యాక్సినేషన్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా, 14 ఏళ్ల లోపు బాలికల కోసం రూపొందించిన దేశవ్యాప్త HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి ప్రారంభించనున్నారు. ‘స్వస్థ నారి’ పేరుతో మహిళా ఆరోగ్య రంగంలో సమానత్వం, రక్షణ కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని కేంద్ర వెల్లడించింది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల మంది 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా ఈ టీకాను ఉచితంగా అందిస్తారు. ఈ వ్యాక్సినేషన్‌ను పూర్తిగా ఐచ్ఛికం చేశారు. టీకా ఇచ్చే ముందు తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోనున్నారు. టీకాల కార్యక్రమం మొదటి 3 నెలల పాటు ‘మిషన్ మోడ్’లో కొనసాగనుంది. ఆ తర్వాత క్రమం తప్పకుండా జరిగే సాధారణ ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌లో భాగంగా అందుబాటులో ఉండనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -