నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ / తుర్కపల్లి : భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్ కె హాస్పిటల్ ఆధ్వర్యంలో తుర్కపల్లి మండలం తుర్కపల్లి గ్రామంలో గల తారక్ డయాగ్నొస్టిక్ సెంటర్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తారక్ డయాగ్నొస్టిక్ సెంటర్ మరియు చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం నందు తుర్కపల్లి గ్రామ పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా బిపి షుగర్ న్యూరోపతి పరీక్షలు నిర్వహించి, ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజకుమార్ చే ఉచిత కన్సల్టేషన్ నిర్వహించారు. తదనంతరం డాక్టర్ సలహా మేరకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ ఉచిత వైద్య శిబిరం నందు 100 మంది వరకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తారక్ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులు కొండల్ రెడ్డి, పడిగం భానుశంకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా క్యాంప్ నిర్వాహకులు మాట్లాడుతూ తుర్కపల్లి గ్రామ, పరిసర ప్రాంతాల ప్రజలకు వారి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల పెద్ద పెద్ద వ్యాధుల బారిన పడకుండా నివారించుకోవచ్చునని ఈ అవకాశాన్ని ప్రజలకు కల్పించడం కోసం సహకరించిన, శ్రీ ఆర్కే హాస్పిటల్ డాక్టర్ చావా రాజ్ కుమార్ కి వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
తారక్ డయాగ్నొస్టిక్ సెంటర్ నందు ఉచిత వైద్య శిబిరం….
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


