నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన సంవత్సరం సందర్భంగా ఎల్లగిరిలో హైదరాబాద్ కామినేని హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎల్లగిరి గ్రామ సర్పంచ్ రిక్కల మహేందర్ రెడ్డి ఉప సర్పంచ్ కందకట్ల సురేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సమిష్టిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు గ్రామస్తులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు మరియు ఉచిత మందులు అందజేశారు. రక్తపోటు, షుగర్, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని వయస్సుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను పొందారు.గ్రామ ప్రజల ఆరోగ్యం మా ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలను కొనసాగిస్తామని గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్లు పేర్కొన్నారు



