ఉచిత మెగా వైద్య శిబిరం..

Free mega medical campనవతెలంగాణ – మోపాల్
కులాస్పూర్ గ్రామంలో శ్రీ సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామంలో ఆదివారం నాడు శ్రీ సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 250 నుంచి 300 ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేసి బీపీ షుగర్ సేవలను చేయడం జరిగింది. ఈ సందర్భంగా గడీల శ్రీరాములు గారు మాట్లాడుతూ.. నూతనంగా ప్రారంభించిన సిగ్మా హాస్పిటల్ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. అన్ని రకాల ఇన్సూరెన్స్ సేవలను ప్రారంభించామని, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీ కృష్ణ కిషోర్ రెడ్డి గారు కార్డియాలజీ విభాగంలో అత్యున్నత వైద్య సేవలను అందిస్తున్నారని చెప్పారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు సిగ్మా హాస్పిటల్ కి నేరుగా వచ్చి ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు..పేద మరియు మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని కార్డియాలజీ విభాగంలో ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రారంభించామని చెప్పారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఆసుపత్రికి వచ్చి డాక్టర్లను సంప్రదించగలరని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, జనార్దన్ రెడ్డి, నాగరాజు గౌడ్, డాక్టర్ల బృందం కార్డియాక్ డాక్టర్ దిలీప్ గారు, న్యూరో సర్జన్ డాక్టర్ చక్రవర్తి గారు , ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ డాక్టర్ వెన్నెల గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ సర్జన్ డాక్టర్ పారాసు జైన్, నర్సింగ్ సూపర్డెంట్ లిల్లీ, మాధవ్, రవి, శ్రీధర్, సామ్రాట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love