నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్: భువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో పల్లెకి వైద్యం కార్యక్రమంలో భాగంగా 128వ ఉచిత మెగా వైద్య శిబిరం పహాడీ నగర్ శ్రీ ఆర్కే హాస్పిటల్ నందు నిర్వహించారు. స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. వైద్యా శిబిరంలో బీపీ షుగర్, న్యూరోపతి, బిఎండి,తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు శ్రీ ఆర్కే హాస్పిటల్ అధినేత జనరల్ పిజిషియన్ డాక్టర్ చావా రాజ్ కుమార్, దంత వైద్య నిపుణులు డాక్టర్ చావా అశ్లేష హాస్పిటల్ ఇంచార్జ్ కొండల్ రెడ్డిలు మాట్లాడారు. ఈ ఉచిత వైద్య శిబిరం నందు బిపి షుగర్ న్యూరోపతి బిఎండి మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశామని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని ప్రజలకు సూచించామని, దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అవగాహన కల్పించామన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో భాగంగా 100 మందికి పైగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది.
ఉచితంగా మెగా వైద్య శిబిరం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



