- Advertisement -
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని దామరవాయి గ్రామంలో రేపు ఆదివారం తెలంగాణ సీనియర్ రెసిడెన్సి డాక్టర్స్ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రంజిత్ తెలిపారు. దామరవాయి, చుట్టుపక్క పరిసర గ్రామాల ప్రజలు, రోగులు వచ్చి పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులు పొందాలని తెలిపారు. మండలంలో దామరవాయిలో జరుగు ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- Advertisement -