- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా బూట్లు, బెల్టులు పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే రెండు జతల యూనిఫామ్ ఉచితంగా అందిస్తుండగా, ఈ ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. దీంతో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందనున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో బాలికలకు ప్రాధాన్యం ఇవ్వాలని, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉదయం అల్పాహారం అందించాలని సీఎం ఆదేశించారు.
- Advertisement -



