Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్మైనార్టీలకు ఉచిత శిక్షణ..

మైనార్టీలకు ఉచిత శిక్షణ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యములో తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్ వారి ద్వార యూపీఎస్సీ –  సి ఎస్ ఏ టి, 2026 పరీక్ష కోసం 2025-26 విద్యా సంవత్సరమునకు తెలంగాణాకు చెందిన (100) మంది  మైనారిటీ అభ్యర్థులకు  (ముస్లిములు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారశిలు) ఉచిత శిక్షణ అందించినట్లు మైనార్టీ శాఖ అధికారి యాదయ్య తెలిపారు. ఈ శిక్షణకు రిజర్వేషన్ల నియమ ప్రకారం మహిళా అభ్యర్థులకు 33.33% సీట్లు మరియు అన్ని రిజర్వ్డ్ కేటగిరీలలో వికలాంగులకు 5% సీట్ల కేటాయించనున్నట్లు, తల్లిదండ్రులు/సంరక్షకుల వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.5.00లక్షలకు మించకుండా, హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ లో మొదటిసారి ప్రవేశం పొందే అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని,   ప్రవేశం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుందని తెలిపారు. యుపిఎస్సి (సిఎస్ఎటి -2026) యొక్క సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ప్రవేశం కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని  సాధారణ / ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీస్ అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ http://cet.cgg.gov.in/tmreis వెబ్ సైట్ ద్వారా తేది: 01.05.2025 నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని, మే 24 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, స్క్రీనింగ్ టెస్ట్ ప్రవేశ పరీక్షా జూన్ 5వ తేదీన ఉదయం 10:30 నుండి సాయంత్రం 12:30 గంటల వరకు జిల్లా కేంద్రము లో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో  నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం కార్యాలయంలో సంప్రదించాలని, మైనార్టీ విద్యార్థులు  సదవకాశాన్ని సద్వినియోగపర్చుకోగలరని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -