Monday, October 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనెలరోజులకే ఫ్రాన్స్‌ ప్రధాని రాజీనామా

నెలరోజులకే ఫ్రాన్స్‌ ప్రధాని రాజీనామా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఫ్రాన్స్‌ నూతన ప్రధాని సెబాస్టియన్‌ లెకోర్న్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్‌ను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నెలరోజులు కూడా కాకముందే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ ఆయన రాజీనామాను ఆమోదించారని ఫ్రాన్స్‌ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సెబాస్టియన్‌ లెకోర్న్‌ కేబినెట్‌ ఎంపికపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్త మయ్యాయి. ముఖ్యంగా మాజీ ఆర్థిక మంత్రి బ్రూనో లెమైర్‌ను రక్షణ మంత్రిగా తిరిగి తీసుకోవాలనే ఆయన నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర కీలక పదవుల్లో పెద్దగా మార్పులు ప్రకటించలేదు. బ్రూనో రిటైల్‌ అంతర్గత మంత్రిగా, పోలీసింగ్‌ మరియు అంతర్గత భద్రత బాధ్యతలను చేపట్టారు. జీన్‌ నోయెల్‌ బారోట్‌ విదేశాంగ మంత్రిగా కొనసాగుతుండగా, జెరాల్డ్‌ డార్మానిన్‌ న్యాయమంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -