Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీ ఓ ఆధ్వర్యంలో  పెద్ద ఏడ్గి జీపి లో  ఫ్రైడే - డ్రై డే కార్యక్రమం...

ఎంపీ ఓ ఆధ్వర్యంలో  పెద్ద ఏడ్గి జీపి లో  ఫ్రైడే – డ్రై డే కార్యక్రమం నిర్వహణ.

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పెద్ద ఏడికి గ్రామంలో ఎంపీ ఓ రాము ఆధ్వర్యంలో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం జీపి కార్యదర్శి రమేష్ చారి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీవో , జీపి కార్యదర్శి , ఆశ వర్కర్లు , ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కలిసి ఒక టీం గా ఏర్పడి గ్రామంలో ని పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను సమగ్రంగా పరిశీలించి పలు సూచనలు జిపి అధికారికి,  గ్రామస్తులకు తెలియ చేశారు. మొదటగా గ్రామనికి అవసరమైన నీరు అందించే వాటర్ ట్యాంకర్ ను జీపి సిబ్బందితో శుభ్రం చేయించారు. వారానికి రెండు పర్యాయాలు వాటర్ ట్యాంక్ ను శుభ్రపరచాలని పరిసరాలు వద్ద బ్లీచింగ్ పౌడర్ వెదజల్లాలని కార్యదర్శికి ఆదేశించారు. గ్రామంలో ఓ ఇంటిని సందర్శించి డబ్బాలలో , గుంతలలో నిలువ ఉంచిన నీటిని చూసి ఇంటి యజమానులకు నీరు నిల్వ చేయవద్దని, ఒకవేళ నీటిని ఇంటి అవసరాలకు నిల్వ చేయాలంటే డబ్బాలపైన మూతలు కప్పి ఉంచాలని , బహిరంగంగా తెరిచి ఉంచకూడదని పలు సూచనలు చేశారు . నీరు నిల్వ ఉండే ప్రదేశంలో దోమలు వ్యాప్తి చెందుతాయని అన్నారు. దోమలు కుట్టడం వలన  మలేరియా , డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు . ప్రజలు అనారోగ్యం పాలవుతారని తెలియజేశారు . గ్రామంలో శానిటేషన్ పనులు నిత్యం చేపట్టాలని కార్యదర్శికి ఆదేశించారు . అనంతరం ఉపాధి హామీ ఆధ్వర్యంలో చేపడుతున్న నర్సరీని సందర్శించి  మొక్కల పెంపకం ఎన్ని చేపట్టినాధని ఫీల్డ్ అసిస్టెంట్ సుభాష్ ను అడిగి తెలుసుకున్నారు. వానమహోత్సవ కార్యక్రమం ప్రారంభం అయినందున మొక్కలను పూర్తిగా వాడుకోలోకి తీసుకొని ఖాళీ ప్రభుత్వ ప్రదేశాలలో ఉపాధి కూలీలచే నాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాముతో పాటు జిపి కార్యదర్శి రమేష్ చారి , ఫీల్డ్ అసిస్టెంట్ అస్పత్ వార్ సుభాష్ , అంగన్వాడీ టీచర్ యమునా,  ప్రేమల, ఆశ వర్కర్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -