Saturday, May 17, 2025
Homeసినిమామదర్‌ సెంటిమెంట్‌తో 'ఫ్రైడే'

మదర్‌ సెంటిమెంట్‌తో ‘ఫ్రైడే’

- Advertisement -

దియా రాజ్‌, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్‌ వశిష్ట, రోహిత్‌ బొడ్డపాటి హీరో, హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘ఫ్రై డే’. శ్రీ గణేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై కేసనకుర్తి శ్రీనివాస్‌ నిర్మించారు. ఈశ్వర్‌బాబు ధూళిపూడి దర్శకుఉడ. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మదర్స్‌ డే సందర్భంగా ఈ సినిమాలోని అమ్మ ప్రేమను చాటే పాటను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత రిలీజ్‌ చేశారు. ఈ పాటను స్నిగ్ద నయని ఆలపించారు. మధు కిరణ్‌ సాహిత్యం, ప్రజ్వల్‌ క్రిష్‌ బాణీ ప్రతీ ఒక్కరి హదయాన్ని తాకేలా ఉంది. నిర్మాత కేసనకుర్తి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘ఈశ్వర్‌ చెప్పిన కథ నా మనసుకు తాకింది. మదర్స్‌ డే సందర్భంగా అమ్మ పాటను రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. ‘ఇందులో మదర్‌ సెంటిమెంట్‌ ఉంటుంది. సినిమా చూసిన ప్రతీ తల్లి తన కొడుకుని ఓ ఛత్రపతి శివాజీలా, మహారాణా ప్రతాప్‌ సింగ్‌లా పెంచుతారు. పోరాడే శక్తిని అమ్మ మాత్రమే ఇస్తుంది’ అని డైరెక్టర్‌ ఈశ్వర్‌ బాబు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -