నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్, భారతదేశానికి బిర్యానీ రాజధాని అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. 2025లో కూడ హైదరాబాద్ తన ఫుడ్ ప్రైడ్ కిరీటాన్ని పదిలంగా నిలబెట్టుకున్నది. శాకపాకాల విషయంలో తనకు ఉన్న ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ హైదరాబాద్ వారి ఫుడ్ కార్ట్ 2025లో బిర్యానీలు ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, దానికి ప్రాంతీయమైన బ్రేక్-ఫాస్ట్ లు ఊతంగా నిలువగా, స్నాక్ సమయంలోనూ, రాత్రి పొద్దుపోయిన తర్వాత తీసుకునే సౌకర్యవంతమైన ఫుడ్ దీనికి ఉత్ప్రేరకంగా నిలిచాయి. తనకు రుచించే – సాహసోపేతమైన, బాగా తెలిసిన, ఎంతో సంతృప్తిని కలిగించే దానిని నగరం ఎన్నుకున్నది.
స్థానికంగా మెచ్చిన చారిత్రాత్మక ఫుడ్ ను రోజువారి కంఫర్ట్ ఫుడ్ తో బ్యాలెన్స్ చేస్తూ, హౌ ఇండియా స్విగ్గీడ్ ఇన్ 2025 యొక్క హైదరాబాద్ ఎడిషన్ నుండి కొన్ని ప్రధానాంశాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము.
నగరం మెచ్చినవి
- భారతదేశపు బిర్యానీ రాజధాని అన్న తన బిరుదుని నిలబెట్టుకుంటూ హైదరాబాద్ నగరం అచ్చెరువొందించే స్థాయిలో 175 లక్షల బిర్యానీలను ఈ ఏడాదిలో ఆర్డర్ చేసింది. భారతదేశవ్యాప్తంగా ఆర్డర్ చేసిన బిర్యానీలలో ఇది దాదాపు 18% !
- 108 లక్షల ఆర్డర్లతో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో నిలిచి, నగరంలో అత్యంత ఆదరాభిమానాలను చూరగొంటున్న డిష్ గా తన స్థానాన్ని పదిలపరుచుకున్నది.
- దాని తర్వాత స్థానంలో స్థానికమైన కంఫర్ట్ ఫుడ్ నిలిచింది. 39.9 లక్షల ఆర్డర్లతో వెజ్ దోశ రెండవ స్థానంలో నిలువగా, (34 లక్షల ఆర్డర్లతో) ఇడ్లీ మూడవ స్థానంలో నిలిచి ఉన్నది.
- OG డెస్సర్ట్స్ నగరం మెచ్చినవి. బూందీ లడ్డూలు (3.3 లక్షల ఆర్డర్లతో) నగరం మెచ్చిన స్వీట్ గా ఆవిర్భవించగా, దాని తర్వాత చాక్లెట్ కేక్ మరియు గులాబ్ జామున్ లు వంటివి ఆకర్షణీయమైన ఎంపికలుగా నిలిచాయి.
- ఉదయం వేళల్లో సౌకర్యానుకూలమైన వాటికి ప్రాధాన్యం లభించింది. 19.5 లక్షల ఆర్డర్లతో వెజ్ దోస అత్యధిక సంఖ్యలో ఆదరించబడిన బ్రేక్ ఫాస్ట్ గా నిలిచింది. దాని తర్వాత 18.1 లక్షల ఆర్డర్ల తో స్వల్ప వ్యత్యాసంతో ఇడ్లీ, దానితోపాటు ఎల్లవేళలా విశ్వసనీయమైన వెజ్ వడ ద్వితీయ స్థానంలో నిలిచి, ఉదయం అల్పాహారపు ఛాయిస్ లను సరళంగా, సర్వజనీనంగా ఉంచాయి.
- సాయం వేళల్లో (సా. 3 మరియు సా. 7) మెప్పించిన స్నాక్స్ ను గమనిస్తే, 6.8 లక్షల ఆర్డర్లతో చికెన్ బర్గర్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. దాని తర్వాత స్వల్ప వ్యత్యాసంతో (5.9 లక్షల ఆర్డర్లతో) చికెన్ ఫ్రై రెండవ స్థానంలో నిలిచింది. ప్రజాదరణ పొందిన ఇతర స్నాక్-టైమ్ ఆహారాల్లో చికెన్ షవర్మ, వెజ్ పిజ్జా ఇంకా వెజ్ పఫ్ ఉన్నాయి అంతర్జాతీయ, స్థానిక రుచుల పట్ల . హైదరాబాద్ ప్రజలకు ఉన్న మక్కువకు ఇది అద్దం పడుతుంది.
- ఉదయం వేళలు స్థిరంగా కనిపించగా, రాత్రి వేళల మక్కువతో ఆహారాన్ని తెప్పించుకోవటం కనిపిస్తుంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత (అర్ధరాత్రి 12 గం. మరియు తెల్లవారుఝామున 2 గం.) ఇచ్చిన ఆర్డర్లలో 6 లక్షల ఆర్డర్లతో చికెన్ బిర్యానీ ది అగ్రస్థానం కాగా, దాని తర్వాత స్థానాలను చికెన్ బర్గర్ మరియు చికెన్ షవర్మ స్వంతం చేసుకున్నాయి.
- ఏ యేటికా ఏడు 20 శాతానికి పైగా పెరుగుతున్న ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడులకు చెందిన భోజనప్రియుల అభిమానాన్ని చూరగొన్న ప్రాంతీయ వంటకాల పట్ల మాత్రమే కాక హైదరాబాద్ నగరం, గుజరాతీ మరియు బెంగాలీ వంటకాల పట్ల కూడా ప్రేమాభిమానాలను ప్రదర్శించారు. గత ఏడాదితో పోలిస్తే 14 శాతం పెరిగిన ఈ ఏడాది ఆర్డర్లు ఇందుకు నిదర్శనం.
- సిటీ ఆర్డర్ చేసిన తీరుతెన్నుల్లో సౌలభ్యం ఒక కీలకమైన పాత్రను పోషించింది. దేశంలోకెల్లా అతి ఎక్కువగా గ్రూప్ ఆర్డర్లను నమోదు చేసున్న రెండవ నగరంగా హైదరాబాద్ నిలిచింది.
- అంతే కాక నగరం దేశవ్యాప్తంగా అతి ఎక్కువ ఇంకాగ్నిటో ఆర్డర్లను చేసిన నగరాల్లో రెండవ స్థానంలో నిలిచింది. వాటిల్లో చికెన్ బిర్యానీ టాప్ ఛాయిస్ గా నిలిచింది – స్టెల్త్ మోడ్ లో కూడా.
- పని మరియు లంచ్? సమస్యే లేదు. డెస్క్ఈట్స్ పై, కార్పొరేట్ ప్రొఫెషనల్స్ మెచ్చినవాటిలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకా పనీర్ బిర్యానీ వంటి బిర్యానీలు ఉండగా, 5.7 లక్షలకు పైగా ఆర్డర్లతో మసాలా దోశ కూడా అభిమానాన్ని చూరగొన్న వంటకాల్లో ఉన్నది. హైదరాబాద్ లో ఒక కస్టమర్ 10 అపోలో ఫిష్, 11 పుట్ట గొడుగుల వేపుడు, 13 కాజూ కోడి రోస్ట్ మరియు 42 ప్లేట్ల బిర్యానీల భారీ విందు భోజనాన్ని ఆర్డర్ చేశారు! ఇక ఆఫీస్ పార్టీ గురించి మాట్లాడుకుందామా!
- అధిక ప్రోటీన్ అసలైన MVP. హైదరాబాద్ నగరే 22.13 లక్షల హై-ప్రోటీన్ ఆర్డర్లను ఇచ్చి దేశవ్యాప్తంగా మూడవ ర్యాంకులో నిలిచింది.
బోల్ట్ తో వేగంగా ఫుడ్ డెలివరీ సాధ్యం అయ్యింది
- భారతదేశంలోకెల్లా అతి ఎక్కువ బోల్ట్ ఆర్డర్లను చేసిన నగరాల్లో హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచింది. 17.4 లక్షల ఆర్డర్లతో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో నిలువగా, (6.9 లక్షలతో) ఇడ్లీ మరియు (6.6 లక్షలతో) వెజ్ దోశ తదుపరి స్థానాల్లో నిలిచాయి.
- బోల్ట్ పై అత్యధికంగా ఆర్డర్ చేయబడిన డెస్సర్ట్ స్థానాన్ని చాకో లావా కేక్ దక్కించుకోగా, డబుల్ కా మీఠా, మోతీచూర్ లడ్డూ మరియు ఆప్రికాట్ డిలైట్లు టాప్ 5లో స్థానాన్ని దక్కించుకున్నాయి.
- బోల్ట్ యొక్క మెరుపు! ఒక కస్టమర్ కు 3 నిముషాల్లో చికెన్ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్ ను డెలివర్ చేయటం జరిగింది.
- బిర్యానీ పట్ల ప్రేమాభిమానాలు 24×7 కొనసాగాయి. రాత్రి పొద్దపోయిన తర్వాత (అర్ధరాత్రి 12 గం.- తెల్లవారుఝామున 2 గం.) అత్యధికంగా ఆర్డర్ చేయబడినది చికెన్ బిర్యానీ. రోజుకు 168 ఆర్డర్లతో చికెన్ షవర్మ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాలను చికెన్ బర్గర్ మరియు మటన్ బిర్యానీ స్వంతం చేసుకున్నాయి.
- చివరి నిముషంలో పార్టీకి సామాగ్రులు కావాలా? నగరంలో అతి పెద్ద బోల్ట్ ఆర్డర్ చేసిన కస్టమర్ 135 బ్రౌనీలను ఆర్డర్ చేశారు!
ట్రెండ్లను మరింత వివరంగా తెలియచేస్తూ, సిద్ధార్థ్ భాకూ, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, ఫుడ్ మార్కెట్ ప్లేస్, స్విగ్గీ ఇలా చెప్పారు “2025లో, దైనందిన జీవితంలోనూ మరియు వేడుకల్లో కూడా ఆహారం ప్రధానమైన పాత్రను పోషించటం కొనసాగింది. భారతదేశం తాను మెచ్చిన వంటకాల పట్ల అభిమానాన్ని ప్రదర్శించింది. హైదరాబాద్ నగరంలో మాకు, క్లాసిక్స్ పట్ల ప్రేమాభిమానాలు మరియు జాతీయస్థాయిలో ప్రజలు అభిమానించిన వంటకాల పట్ల సమతౌల్యం కనిపించింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత తెప్పించుకున్న రుచికరమైన ఆహారాలు మొదలుకుని ప్రీమియం డైనింగ్ అవుట్ వరకు, హైదరాబాద్ నగరం ఆహారం ద్వాతా ఘనమైన టేప్స్ట్రై సంస్కృతిని అవలంబించింది. ఆహారం ఒక భావన. నగరంలో మూలమూలలకు అద్భుతమైన ఆహారపు అనుభవాలను డెలివర్ చేయాలన్న సంకల్పానికి మేము కట్టుబడి ఉన్నాము. ఒక భోజనం, ఒక వేడుక ఒక సారి.”
డైనింగ్ అవుట్
- హైదరాబాద్ సామాజిక జీవితంలో డైనింగ్ అవుట్ అనేది ఒక పెద్ద పాత్రను పోషించటం కొనసాగిస్తోంది. స్విగ్గీ డైనవుట్ల ద్వారా డైనర్లు భారీ స్థాయిలో 114.8 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఆదా చేసుకున్నారు. ఇది భారతదేశంలో కెల్లా మూడవ అత్యధిక మొత్తం. 73.4 శాతం బలమైన ఏ యేటికా యేడు అభివృద్ధి.
- వ్యక్తిగత స్థాయిలో కూడా భారీ పొదుపులు గణనీయంగా కనిపించాయి. ఒక సింగిల్ బుకింగ్ నుండి ఒక కస్టమర్ రూ. 1,17,905లను ఆదా చేసుకున్నారు – జాతీయ స్థాయిలో చూస్తే ఇది రెండవ అత్యధిక ఆదా సొమ్ము.
- నగరంలో పార్టీ సంస్కృతి సజీవంగా ఉన్నది. అర్ధరాత్రి 12 గంటలు మరియు తెల్లవారుఝామున 3 గంటల మధ్యలో డైనింగ్ లావాదేవీల కోసం గాను హైదరాబాద్ అగ్రస్థానంలోని 5 నగరాల్లో ఒకటిగా నిలిచింది.
- గ్రేట్ ఇండియన్ రెస్టారెంట్ ఫెస్టివల్ (GIRF 2025) సందర్భంగా హైదరాబాద్ లోని డైనర్లు, భారీ స్థాయిలో 47.72 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారు
- ప్రీమియం డైనింగ్ నిజంగా వేగాన్ని పుంజుకున్నది. గణనీయమైన రీతిలో 110% YoY అభివృద్ధిని నమోదు చేసుకున్నది.
- ఏడాది అంతా ఇంటి వెలుపల తినటానికి వేడుకలు ముఖ్యమైన కారణం. (8,700+) వ్యాలెంటైన్స్ డే బుకింగులు, దానితోపాటు రూ. 45,721ల అత్యధిక బిల్లు తో హైదరాబాద్ నగరం రెండవ స్థానంలో నిలిచింది.
- మదర్స్ డే రోజున కూడా గట్టిగానే భాగస్వామ్యం కనిపించింది. ఆ రోజున 8,323 బుకింగ్స్ నమోదు చేసుకోగా, అత్యధిక బిల్లు రూ. 98,725 గా నమోదయ్యింది.
- 9,275 బుకింగులతో, భారతదేశంలో రూ. 66,198ల అత్యధిక సింగిల్ బిల్ తో ఫాదర్స్ డే ప్రత్యేకంగా నిలిచింది.
వినోదాన్ని మరింతగా ఇనుమడింపజేసే విధంగా, 2025లో భారతదేశపు ఆహారపు ట్రెండ్ లను కొన్నింటిని ఈ దిగువ చూడండి
- అతిఎక్కువ ఆదరాభిమానాలను చూరగొంటున్న వంటపదార్ధంగా దశాబ్దకాలంగా రికార్డు నెలకొల్పుతున్న బిర్యానీ ఇప్పటికీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది! 2025లో 93 మిలియన్ బిర్యానీలు ఆర్డర్ చేయబడ్డాయి (అంటే నిముషానికి 194 ఆర్డర్లు లేదా ప్రతి సెకండుకు 3.25 బిర్యానీలు). దీనితో, బిర్యానీ సాటిలేని మహరాజుగా నిలిచి, ట్రెండ్స్ వస్తుంటాయి పోతుంటాయి కాని, సుగంధాలు చిమ్మే ఈ మహత్తరమైన వంటకం పట్ల భారతదేశానికి ఉన్న లోతైన ప్రేమ ఎన్నటికీ నిలిచిపోతుందని నిరూపించింది. బిర్యానీ ప్రపంచంలో అతి ఎక్కువగా రిపీట్ ఆర్డర్లను సాధించిన చికెన్ బిర్యానీ (57.7 మిలియన్ ఆర్డర్లతో) అత్యధిక అభిమానాన్ని చూరగొన్నది.
- 44.2 మిలియన్ ఆర్డర్లను పొందిన బర్గర్లు అత్యధికంగా అభిమానాన్ని చూరగొన్న పదార్ధాల్లో రెండవ స్థానంలో నిలువగా, దాని తర్వాత స్థానంలో 40.1 మిలియన్ ఆర్డర్లతో పిజ్జాలు నిలిచాయి. 26.2 మిలియన్ ఆర్డర్లతో వెజ్ దోస వినియోగదారుల ఆదరాభిమానాలను చూరగొన్న మరొక వంటకంగా నిలిచింది. పెళుసుగా, బంగారు వన్నెలో ఉండే ఈ మహత్తరమైన వంటకం పట్ల భోజనప్రియులు మక్కువ చూపించారు.
- స్నాక్ సమయం (3- 7 సా.) ఒక మూడ్, మనం అందరం అందులో జీవిస్తాము. స్నాక్స్ లో అతి ఎక్కువగా ఆర్డర్ చేయబడినవి బర్గర్లు కాగా, అందులో చికెన్ బర్గర్లు (6.3 మిలియన్ ఆర్డర్లతో) అగ్రస్థానంలో నిలువగా, స్వల్ప వ్యత్యాసంతో 4.2 మిలియన్ ఆర్డర్లు సాధించిన వెజ్ బర్గర్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. వినియోగదారు మెచ్చిన ఇతర స్నాక్ పదార్ధాలు – చికెన్ రోల్ (4.1 మిలియన్ ఆర్డర్లు), వెజ్ పిజ్జా (3.6 మిలియన్ ఆర్డర్లు) ఇంకా చికెన్ నగ్గెట్స్ (2.9 మిలియన్ ఆర్డర్లు).
- 2025లో స్నాక్ సమయంలో (సా.3 గం.- సా.7 గం.) మధ్య 3.42 మిలియన్ సమోసాలు ఇంకా 2.9 మిలియన్ అల్లం చాయ్ ల ఆర్డర్లతో చాయ్-సమోసా సాంప్రదాయం కొనసాగింది.
- డెస్సర్ట్ డిలైట్ లు ఇంకా రుచికరమైన పదార్ధాలు: 6.9 మిలియన్ ఆర్డర్లతో వైట్ చాక్లెట్ అగ్రస్థానంలో నిలిచినప్పటికీ, 2025 సంవత్సరంలో దేశీ మిఠాయిల పట్ల అభిమానం కనిపించింది. చాక్లెట్ కేకులు(5.4 మిలియన్ ఆర్డర్లతో) ఇంకా గులాబ్ జామూన్లు (4.5 మిలియన్ ఆర్డర్లతో) అత్యధికంగా ఆర్డర్ చేయబడిన 3 డెస్సర్ట్స్ లో స్థానాన్ని దక్కించుకున్నాయి. కాజూ బర్ఫీ (2 మిలియన్ ఆర్డర్లతో), ఇంకా బేసన్ లడ్డూ (1.9 మిలియన్ ఆర్డర్లతో) భారతదేశపు మిఠాయిలలో 2వ మరియు 3వ స్థానాలను స్వంతం చేసుకున్నాయి.
- డార్క్ చాక్లెట్ ఐస్ క్రీములు 3.3 మిలియన్ ఆర్డర్లను, చాక్లెట్ సండేస్ 2.6 మిలియన్ ఆర్డర్లను దక్కించుకోవటంతో ఐస్ క్రీమ్ లలో ఈ ఏడాది చాక్లెట్ ఫ్లేవర్ స్వంతం అయ్యింది.
- మెక్సికన్ (16 మిలియన్ ఆర్డర్లు), టిబెటన్ (12 మిలియన్లకు పైగా ఆర్డర్లు), కొరియన్ (4.7 మిలియన్ ఆర్డర్లు) వంటకాలు వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటూండటంతో, అంతర్జాతీయ వంటకాలు కార్టులలోకి వచ్చి చేరుతున్నాయి. 2025లో అతి ఎక్కువగా సెర్చ్ చేయబడిన అంతర్జాతీయ వంటకంగా మచ్చా నిలిచింది.
- స్థానిక వంటల పట్ల ప్రేమాభిమానాల నేపథ్యంలో హైపర్ లోకల్ అనేది కొత్త అథెంటిక్ గా నిలిచింది. గత ఏడాది కాలంలో పహాడీ శాకపాకాలు (వంటలు) 9 రెట్లు పెరుగుదల నమోదు చేసుకోగా, మలబరీ, రాజస్థానీ, మాల్వానీ, తదితర ప్రాంతీయ శాకపాకాలు కూడా దాదాపు 2 రెట్లు పెరిగాయి.
- అన్ని భోజనవేళలతో పోలిస్తే రాత్రి భోజనం (డిన్నర్) బాహుబలి వంటిదనటంలో ఎటువంటి సందేహం లేదు. లంచ్ ఆర్డర్లతో పోలిస్తే డిన్నర్ ఆర్డర్లు 32 శాతం అధికంగా నమోదు చేసుకున్నాయి.
- విశాల హృదయం, భారీ వేడుకలు : హైదరాబాద్ లో ఒక కన్స్యూమర్ రూ. 47,106 లు ఖర్చు పెచ్, 65 డబ్బాల డ్రై ఫ్రూట్ కుకీల గిఫ్ట్ ప్యాక్ లను ఆగస్టులో ఆర్డర్ చేసి పండుగ సీజన్ కు శ్రీకారం చుట్టారు!
- ముంబయ్ లో ఒక ఫుడీ “డైనింగ్ ఆల్ డే (రోజంతా డైనింగ్)”ను పునర్నిర్వచించి, 2025లో స్విగ్గీలో 3,196 ఫుడ్ ఆర్డర్లను చేసి ఉన్నారు. అంటే, దాదాపు రోజుకు 9 ఆర్డర్లు అన్నమాట – దేశంలో కల్లా అత్యధికం!
- తాము మెచ్చిన ఆహారం కోసం, ఆకలి వేళల చూసే ఆ ఎదురుచూపుల కోసం సమయానికి వేగంగా ఫుడ్ డెలివరీ చేసేందుకు బోల్ట్ దన్నుగా నిలిచింది. బెంగుళూరులో అత్యధిక సంఖ్యలో డెలివరీలు జరిగాయి, ఆ తర్వాత హైదరాబాద్ మరియు ముంబయ్ లలో జరిగాయి. ఇంకా, అహ్మదాబాద్, జైపూర్, వైజాగ్ మరియు కొచ్చిలు కూడా బోల్ట్ కు ఆవిర్భవిస్తున్న మార్కెట్లుగా నిలిచాయి.
- ఆసక్తికరంగా, ముంబయ్ లో ఒక కస్టమర్ భారీ స్థాయిలో విందుభోజనం కోసం ఆర్డర్ చేశారు – 15 యూనిట్ల దమ్ చికెన్ బిర్యానీ, 10 ప్లేట్ల చికెన్ మీట్ బాల్ కబాబ్, 5 ప్లేట్ల ఫలాఫర్-ఎ-ఖాస్, ఇంకా పెప్పర్ పనీర్ బిర్యానీ, 100 గులాబ్ జామూన్ల కోసం 99Store లో ఆర్డర్ చేశారు! చాలా పెద్ద పార్టీలా ఉన్నది!
- నిజంగా దీన్ని సుసాధ్యం చేసిన మా డెలివరీ పార్టనర్లు, మీరు కోరుకున్న ఆహారాలకు చిరునవ్వులను అద్ది, , హాట్ మీల్ ను అందించటంలో సహకరించారు! మా డెలివరీ పార్ట్నర్లు ఈ ఏడాది చారిత్రాత్మకమైన విధంగా 1.24 బిలియన్ కిలోమీటర్లు నమోదు చేశారు – కష్మీరు నుండి కన్యాకుమారికి 340,000 సార్లు మథ్యలో చాయ్ కోసం ఆగుతూ డ్రైవ్ చేయటం లాంటిది!
- మొహమ్మద్ రజీఖ్ అనే బెంగుళూరుకు చెందిన మా డెలివరీ పార్ట్నర్, అవిశ్వసనీయమైన విధంగా ఈ ఏడాదిలో 11,718 ఆర్డర్లు డెలివర్ చేశారు. కాగా చెన్నైకి చెందిన పార్ట్నర్ పూంగోడి, 2025లో 8169 ఆర్డర్లు డెలివర్ చేసి మహిళా పార్ట్నర్లలో ప్రథమ స్థానంలో నిలిచారు!



