Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు-రోగులకు పండ్ల పంపిణీ

ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు-రోగులకు పండ్ల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ జన్మదిన సందర్భంగా జుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రిలో, ఎస్సీ గురుకుల హాస్టల్ విద్యార్థులకు మండల కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం నాడు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మండలంలో దినదినాభివృద్ధి చేస్తూ గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఎమ్మెల్యే గారు నిత్యం అహర్నిశలు ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ పనులు చేస్తున్నారని రాబోయే రోజులలో జుక్కల్ మండలం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఆశ భావం వ్యక్తం చేస్తున్నాం. ఎక్కడైనా సమస్య ఉన్నదంటే వెంటనే స్పందించే తత్వం జుక్కల్ ఎమ్మెల్యే వంతైందని తాను అనారోగ్యంగా ఉన్న సమస్యల పరిష్కారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగదని తన జీవితమంతా ప్రజలకే అంకితం చేసే విధంగా పనులు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఇటువంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతు ప్రార్థిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు మరియు హాస్టల్ విద్యార్థులకు,పేదలకు పండ్ల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు అధ్యక్షుడు లాడేగా వ్ సతీష్ పటేల్ పడంపల్లి గ్రామానికి చెందిన నాయకుడు అన్నజీవర్ మహేష్, జుక్కల్ విజయ్ , వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -