బన్నీ వాస్ వర్క్స్‌తో కలిసి సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ ఒక ఆసక్తికర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ప్రీ-లుక్ పోస్టర్ విడుదలైంది. బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్ పై బన్నీ వాస్ తొలిసారిగా ఈ సినిమాను సమర్పిస్తుండటం.. ప్రాజెక్ట్ పై నమ్మకాన్ని మరింత పెంచింది. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన భాను ప్రతాప గతంలో బన్నీ వాస్‌తో కలిసి ‘తండేల్’కి పని చేసి, బ్లాక్ బస్టర్‌ను అందించారు. ఈ ద్వయం ‘ఆరు’, ‘సింగిల్’ వంటి సినిమాలతో తమ విజయ పరంపరను కొనసాగిస్తూ, ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను పెంచుతున్నారు. ‘హారు నాన్న’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ చేతులు కలపడం ఈ ప్రాజెక్ట్‌కి అదనపు బలాన్ని చేకూర్చింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఫన్, మిస్టరీ, మ్యాడ్ నెస్‌తో రోలర్‌కోస్టర్‌ను సూచిస్తుంది. ఈనెల 6న ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నట్లు పోస్టర్‌లో ప్రకటించిన నిర్మాతలు సరికొత్త వినోదాత్మక చిత్రాన్ని అందించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ చిత్రంతో విజయేంద్ర ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకి సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. ఆర్.ఆర్. ధవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తగిన ఫలితం అన్నట్టుగా నటీనటులను ఆవిష్కరిస్తూ ఉండే ఫస్ట్ లుక్ పోస్టర్ అసలుసిసలైన మ్యాడ్ నెస్‌ను అందిస్తుందని మేకర్స్ తెలిపారు.