- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 2027లో నిర్వహించనున్న జనగణనకు నిధుల కేటాయింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సెన్సస్‌కు రూ.11,718 కోట్లు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. 2027 ఫిబ్రవరి నుంచి తొలిసారి డిజిటల్ జనగణన నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రెండు విడతల్లో జనగణనతో పాటు కులగణన చేయనున్నట్లు చెప్పారు.
- Advertisement -


