Wednesday, August 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధి హామీకి నిధులు పెంచాలి

ఉపాధి హామీకి నిధులు పెంచాలి

- Advertisement -

కేంద్ర నిధుల కోతలతో గ్రామీణాభివృద్ధికి ఆటంకం :
కేంద్ర మంత్రి పి.చంద్రశేఖర్‌కి మంత్రి డాక్టర్‌ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ(సీతక్క) డిమాండ్‌ చేశారు. కేంద్రమిచ్చే నిధుల్లో కోత పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నదని ఎత్తిచూపారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, ములుగు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పైడాకుల అశోక్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాఖపరమైన అంశాలపై మంత్రులు చర్చించారు. తెలంగాణకు గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో నిధులను పెంచాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. గతేడాది కేంద్రం తెలంగాణకు 12 కోట్ల పని దినాలు మంజూరు చేసిందనీ, ఈ ఏడాది 6.5 కోట్ల పని దినాలకే పరిమితం చేసిందని ఎత్తిచూపారు. దీనివల్ల కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదముందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తదనంతరం ఉపాధి హామీ చట్టంపై ఆంక్షలు విధించకుండా నిధులు పెంచాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. సీతక్క విజ్ఞప్తికి కేంద్ర మంత్రి పి.చంద్రశేఖర్‌ సానుకూలంగా స్పందిస్తూ న్యాయం చేసేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -