Friday, May 16, 2025
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ గ్రంథాలయానికి ఫర్నిచర్ సరఫరా

జుక్కల్ గ్రంథాలయానికి ఫర్నిచర్ సరఫరా

- Advertisement -

– 75 వేల రూపాయల ఫర్నిచర్ అందవేత. 

       నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ మండల కేంద్రంలోని శాఖ గ్రంధాలయానికి గ్రంధాలయ చైర్మన్ ఆదేశాలు మీరు పలు రకాల ఫర్నిచర్ ను గురువారం నాడు అంద చేయడం జరిగిందని గ్రంథ పాలకుడు రాజు తెలిపారు. ఈ సందర్భంగా గ్రంధాలయ పాలకుడు రాజు మాట్లాడుతూ జుక్కల్ మండల కేంద్రంలో లైబ్రరీ కి చాలా రోజులుగా ఫర్నిచర్ కొరత ఉండడంతో గుర్తించిన జిల్లా గ్రంధాలయ  చైర్మన్ ఫర్నిచర్ కొరకు నిధులు మంజూరు చేసి,  నేడు సరఫరా చేసి పంపించడం జరిగింది . పేద విద్యార్థులు చదువుకోడానికి ఈ గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందని , మారుమూల ప్రాంతం జుక్కల్ లో  విద్యావంతులకు చదువుకోడానికి ఎంతో సహకారం ఉంటుందని అన్నారు . పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను కూడా  పంపించడం జరిగింది అని ఆయన తెలిపారు. దాతల సహకారంతో పలు రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల తో పాటు ఎస్ మోడల్ చైర్స్, స్టడీ చేర్స్, స్టడీ పాడ్స్, సుమారు 75 వేల రూపాయల విలువగల ఫర్నిచర్ ను జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జుక్కల్ శాఖ గ్రంధాలయానికి గురువారం గ్రంథ పాలకులు రాజుకు అంత చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకుడు రాజు తో పటు పాఠకులు , రాజలింగం తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -