నవతెలంగాణ-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లాకు చెందిన జి.ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన సీపీఐ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈశ్వరయ్యను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రకటించారు. సీపీఐ ఏపీ నూతన కౌన్సిల్ 102 మందితో ఎన్నికవ్వగా.. 33మందిని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
కాగా ఆగస్టులో ఒంగోలులో జరిగిన రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యదర్శి ఎన్నిక జరగాల్సి ఉండగా వాయిదా వేశారు. జాతీయ మహాసభలు ముగిసిన తర్వాత రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకుంటామని సీపీఐ అగ్రనాయకత్వం అప్పుడు ప్రకటించింది. ప్రస్తుతం జాతీయ మహాసభలు ముగియడంతో రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకున్నారు.