నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో పాడి పంటలతో రైతులు సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అధికారులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరి జీవన సాఫల్యం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, పట్టణ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, శంకర్రావు, జూలూరి సుధాకర్, సాయిబాబా, రంగా రమేష్ గౌడ్, పంపరి లక్ష్మణ్, జమీల్, నర్సోల మహేష్, రాజశేఖర్, సునీల్ గౌడ్, కోటి, బండారి, బల్ల శ్రీనివాస్, నిరంజన్, పండు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


