- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ: ఆర్మూర్ రూరల్ సీఐగా గడ్డం జాన్ రెడ్డి శనివారం మండల కేంద్రంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు రూరల్ సీఐగా విధులు నిర్వహించిన కే శ్రీధర్ రెడ్డి ఐజి కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. కరీంనగర్ త్రీ టౌన్ సీఐగా జాన్ రెడ్డి విధులు నిర్వర్తించి ఆర్మూర్ రూరల్ సీఐగా బదిలీపై వచ్చారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన నూతన సీఐకు ఎస్‌ఐ కే. శైలేందర్, పోలీసు సిబ్బంది అభినందనలు తెలిపారు.
- Advertisement -



