నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విధివిధాలను ప్రకటించడం.. జ్యూరీ ఛైర్‌పర్సన్ జయసుధను నియమించడం చకచకా జరిగిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ ఛైర్‌పర్సన్ జయసుధ గురువారం ప్రకటించారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను జ్యూరీ ఎంపిక చేసినట్టు ఆమె తెలిపారు.
14 ఏండ్ల సుధీర్ఘ విరామం తర్వాత ఈ అవార్డులను నేడు ప్రకటించారు. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి, 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ఇచ్చారు. తెలుగు చిత్రాలతోపాటు ఉర్దూ చిత్రాలకూ అవార్డుల్లో ప్రాధాన్యతనిచ్చారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత, స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు. వీటితో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ప్రత్యేక అవార్డులు ప్రకటించారు.
2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్
- కల్కి 2898ఏడీ
- పొట్టేల్
- లక్కీభాస్కర్
- ఉత్తమ బాలల చిత్రం: 35 ఇది చిన్న కథ కాదు
- హిస్టరీ విభాగంలో ఫీచర్ హెరిటేజ్ చిత్రం: రజాకార్
- ఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఐ అండ్ మై ఫ్రెండ్స్
- ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఆయ్
- ఉత్తమ పరిచయ దర్శకుడు: యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)
ఉత్తమ నటీనటులు
- ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప 2)
- ఉత్తమ నటి – నివేదా థామస్ (35 ఇది చిన్న కాదు)
- ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్ (కల్కి)
- ఉత్తమ సహాయ నటుడు – ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
- ఉత్తమ సహాయ నటి – శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
- ఉత్తమ సంగీత దర్శకుడు – బీమ్స్ (రజాకార్)
- ఉత్తమ నేపథ్య గాయకుడు – సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
- ఉత్తమ నేపథ్య గాయని – శ్రేయా ఘోషల్ (పుష్ప 2)
- ఉత్తమ హాస్యనటులు – సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)
- ఉత్తమ బాలనటులు – మాస్టర్ అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక
- ఉత్తమ కథా రచయిత – శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
- ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత – వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)
- ఉత్తమ గేయ రచయిత – చంద్రబోస్ (రాజూ యాదవ్)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – విశ్వనాథ్‌రెడ్డి (గామి)
వ్యక్తిగత విభాగాల్లో అవార్డులు..
- ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి)
- ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
- ఉత్తమ నటి: నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
- ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
- ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
- ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
- ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2-సూసేకి అగ్గిరవ్వ)
- ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)
- ఉత్తమ బాలనటుడు: మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల (35 ఇది చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్)
- ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
- ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)
- ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజూ యాదవ్)
- ఉత్తమ సినిమాటోగ్రఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)
- ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
- ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి)
- ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేశ్ ఆచార్య (దేవర)
- ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)
- ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: కె. చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్‌స్టర్)
- ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)
- ఉత్తమ కాస్టూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి)
స్పెషల్ జ్యూరీ అవార్డులు..
- నటుడు దుల్కర్ సల్మాన్ (లక్కీ భాష్కర్)
- నటి అనన్య నాగళ్ల (పొట్టేల్)
- దర్శకులు సూజిత్, సందీప్ (క)
- నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి (రాజూ యాదవ్)
- స్పెషల్ జ్యూరీ స్పెషల్ మెన్షన్: ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
- తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం: ‘మన సినిమా ఫస్ట్ రీల్’ (రెంటాల జయదేవ్)