తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ -2024కి సంబంధించి 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఏడాదికి మూడు చిత్రాల చొప్పున ఎంపిక చేశారు. శుక్రవారం ఈ అవార్డులను ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజుతో కలిసి జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ప్రకటించారు. సినీ రంగానికి సేవలు అందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్టు తెలిపారు.
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుకు ఎంపిక కావడంపై బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభు త్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎన్టీఆర్ శతజయంతి ఉత్స వాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒకవైపు.. ఎన్టీఆర్ నట ప్రస్థానానికి 75 ఏళ్ళ అమృతోత్సవాలు జరుగుతోన్న శుభ ఘడియలు మరోవైపు.. నటుడిగా నేను 50 ఏళ్ళ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్‌తో సత్కరించిన ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ ప్రకటించడం నా అదృష్టం. దీనిని దైవ నిర్ణయంగా, నా తండ్రి ఆశీర్వాదంగా భావిస్తున్నా’. – బాలకృష్ణ
‘నట ప్రపూర్ణ కాంతారావు ఫిల్మ్ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకం ఉంచి.. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. 2016వ ఏడాదికి రెండో ఉత్తమ చిత్రంగా ‘పెళ్ళిచూపులు’ ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. ఈ విజయం నా అభిమానులకే చెందుతుంది’. – విజయ్ దేవరకొండ
2015వ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా ‘రుద్రమదేవి’, 2018వ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా ‘మహానటి’, 2019కి ఉత్తమ చిత్రంగా ‘మహర్షి’ ఎంపిక కావడంపై ఆయా చిత్ర నిర్మాణ సంస్థలతో పాటు హీరో మహేష్‌బాబు ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీలోనూ సినీ అవార్డులను ప్రభుత్వం ప్రకటించాలి. అలాగే ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఒక అవగా హనకు రావాలి. లేకపోతే తెలం గాణలో ఈ సినిమాకి, ఆంధ్రాలో ఆ సినిమాకు అవార్డు ఇచ్చారనే విమర్శలొస్తాయి. కాబట్టి ఒక ఏడాది తెలంగాణ, మరో ఏడాది ఏపీ అవార్డులను ఇస్తే బాగుం టుంది. తెలుగు సినిమాకి రెండు రాష్ట్రాలు కావాలి.
– మురళీమోహన్
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ : 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాల వివరాలు
2014 – ఉత్తమ తొలి చిత్రం : రన్ రాజా రన్, ఉత్తమ ద్వితీయ చిత్రం : పాఠశాల, ఉత్తమ తృతీయ చిత్రం : అల్లుడు శీను
2015 – ఉత్తమ తొలి చిత్రం : రుద్రమ దేవి, ఉత్తమ ద్వితీయ చిత్రం : కంచె, ఉత్తమ తృతీయ చిత్రం : శ్రీమంతుడు
2016 – ఉత్తమ తొలి చిత్రం : శతమానం భవతి, ఉత్తమ ద్వితీయ చిత్రం : పెళ్లి చూపులు, ఉత్తమ తృతీయ చిత్రం : జనతా గ్యారేజ్
2017 – ఉత్తమ తొలి చిత్రం : బాహుబలి 2, ఉత్తమ ద్వితీయ చిత్రం : ఫిదా, ఉత్తమ తృతీయ చిత్రం : ఘాజీ
2018 – ఉత్తమ తొలి చిత్రం : మహానటి, ఉత్తమ ద్వితీయ చిత్రం : రంగస్థలం, ఉత్తమ తృతీయ చిత్రం :కేరాఫ్ కంచరపాలెం
2019 – ఉత్తమ తొలి చిత్రం : మహర్షి, ఉత్తమ ద్వితీయ చిత్రం : జెర్సీ, ఉత్తమ తృతీయ చిత్రం : మల్లేశం
2020 – ఉత్తమ తొలి చిత్రం : అల వైకుంఠపురంలో, ఉత్తమ ద్వితీయ చిత్రం : కలర్ ఫొటో, ఉత్తమ తృతీయ చిత్రం : మిడిల్ క్లాస్ మెలోడిస్
2021 – ఉత్తమ తొలిచిత్రం : ఆర్‌ఆర్‌ఆర్, ఉత్తమ ద్వితీయ చిత్రం : ఆఖండ, ఉత్తమ తృతీయ చిత్రం : ఉప్పెన
2022 – ఉత్తమ తొలిచిత్రం : సీతారామం, ఉత్తమ ద్వితీయ చిత్రం : కార్తికేయ2, ఉత్తమ తృతీయ చిత్రం : మేజర్
2023 – ఉత్తమ తొలి చిత్రం : బలగం, ఉత్తమ ద్వితీయ చిత్రం : హనుమాన్, ఉత్తమ తృతీయ చిత్రం :భగవంత్ కేసరి.
స్పెషల్ జ్యూరీ అవార్డు : ప్రజాకవి కాళోజీ