నవతెలంగాణ – తొగుట
నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేశామని గజ్వేల్ ఏసిపి నర్సింలు అన్నారు. గురువారం మండల నామినేషన్ కేంద్రాన్ని తొగుట సిఐ లతీఫ్, ఎస్సై రవికాంతరావు ఎంపీడీవో శ్రీని వాస్ రెడ్డి, ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి తో పాటు మరొక ఇద్దరికి మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల దూరం అవతల వాహ నాలు పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. ఏమై నా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన గజ్వేల్ ఏసీపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES