Tuesday, June 24, 2025
E-PAPER
Homeసినిమాదుబాయ్‌లో గ్రాండ్‌గా గామా అవార్డ్స్‌

దుబాయ్‌లో గ్రాండ్‌గా గామా అవార్డ్స్‌

- Advertisement -

గల్ఫ్‌ అకాడమీ మూవీ అవార్డ్స్‌(గామా)కు టాలీవుడ్‌లో స్పెషల్‌ క్రేజ్‌ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. తాజాగా 2025 గామా 5వ ఎడిషన్‌ వేడుక ఆగస్ట్‌ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనుంది. దుబాయ్‌లో జరిగిన కెఇన్‌ఫ్రా ప్రాపర్టీస్‌ ప్రారంభోత్సవ సందర్భంగా గామా 5 ఎడిషన్‌కు సంబంధించిన థీమ్‌ సాంగ్‌ను లాంచ్‌ చేశారు. గీత రచయిత చంద్రబోస్‌ ఈ పాటకు అద్భుతమైన ఆకట్టుకునే సాహిత్యం అందించారు. రఘు కుంచె సాంగ్‌ కంపోజ్‌ చేయడంతో పాటు తానే స్వయంగా పాడిన తీరు అందరినీ అలరించింది. ఈ సంగీత ప్రదర్శనను యూఏఈలోని తెలుగు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఆగస్టు 30న టాలీవుడ్‌ అవార్డ్స్‌తో పాటు ఆగస్టు 29న ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ వేడుకను నిర్వహించేలా భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ‘గామా అవార్డ్స్‌’ చైర్మన్‌ త్రిమూర్తులు మాట్లాడుతూ, ‘దుబాయ్‌లో జరిగే ఏకైక అతి పెద్ద వేడుక గామా అవార్డ్స్‌. గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్నాం. ఆగస్ట్‌ 30న జరగబోయే 5వ ఎడిషన్‌ను కూడా వైభవంగా చేయబోతున్నాం’ అని అన్నారు. ‘వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి వారికి ది గామా ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ ఇచ్చి సత్కరించనున్నాం. వినూత్న రీతిలో జరగబోయే ఈ అవార్డ్స్‌ కార్యక్రమంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌లు, అందర్నీ అలరించే వినోద కార్యక్రమాలు, అద్భుతమైన షోలు ఉంటాయి’ అని ‘గామా అవార్డ్స్‌’ సీఈవో సౌరభ కేసరి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -