- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ : తెలంగాణ వడ్డెర సంఘం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులుగా వెల్దండ మండల పరిధిలోని తిమ్మినోని పల్లి గ్రామానికి చెందిన గండికోట రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఆయిల్ మల్లు ఆదివారం నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వేముల కుమార్, వడ్డెర రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు మల్లేశ్వరి, వరికుప్పల మల్లేష్ ఉన్నారు.
- Advertisement -



