Saturday, September 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగణేష్ నిమజ్జన వేడుకలు.. సీఎం రేవంత్ కీలక పిలుపు

గణేష్ నిమజ్జన వేడుకలు.. సీఎం రేవంత్ కీలక పిలుపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గణపతి నిమజ్జన వేడుకల వేళ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘హైదరాబాద్ మహానగరాన గల్లీ గల్లీలో.. తెలంగాణ రాష్ట్రాన పల్లె పల్లెలో.. 11 రోజులుగా కోట్లాది మంది భక్త జనుల పూజలు అందుకుని.. ప్రజలకు ఆశీస్సులు అందించి.. తిరిగి ప్రకృతి ఒడిలో చేరుతున్న గణేషుడికి ఘనంగా వీడ్కోలు పలుకుదాం. భక్తి శ్రద్ధలతో, తగు జాగ్రత్తలతో ప్రజలు గణేష్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -