నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో యూజీ నీట్ పరీక్షల్లో రిగ్గింగ్‌కు యత్నించిన ఓ ముఠాను స్పెషల్ టాస్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూజీ నిర్వహించే నీట్ తోపాటు పలు ఇతర పరీక్షల్లో.. విద్యార్థులను పాస్ చేయడానికి సదురు ముఠా సభ్యులు డబ్బులు వసూలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. మే4 నిర్వహించిన నీట్ పరీక్షల్లో మాస్ కాపియింగ్ చేయడానికి..అభ్యర్థుల నుంచి డబ్బులు వసూళ్లు చేసినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది..దీంతో వెంటనే అప్రమత్తమైన టాస్క్ పోలీసులు నోయిడాలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. విక్రమ్ సింగ్, ధర్మపాల్, అనికేత్ కుమార్ అనే యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు.
నీట్ పరీక్షల్లో రిగ్గింగ్‌కు యత్నించిన ఓ ముఠా అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES