Monday, July 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగంగాధర సబ్ రిజిస్టార్‌ సస్పెన్షన్

గంగాధర సబ్ రిజిస్టార్‌ సస్పెన్షన్

- Advertisement -
  • కొత్త రిజిస్టార్‌గా సదాశివ రామకృష్ణ

నవతెలంగాణ-గంగాధర: అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలపై గంగాధర సబ్ రిజిస్టార్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గంగాధర మండల కేంద్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం పరిధిలోని కొత్తపల్లి మున్సిపాల్టీలోని భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు అధికారుల విచారణలో తేల్చారు.

కొత్తపల్లిలోని సర్వే నంబర్ 272/14 లోని 20 గుంటల భూమిలో 9 డాక్యుమెంట్లుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలపై సబ్ రిజిస్టార్ అఫ్జల్ నూర్ఖాన్ ను రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజి ఆదేశాల మేరకు డిఐజి రవీందర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్తపల్లిలోని 175, 197, 198 సర్వే నంబర్లలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు ఇప్పటికే 476 రిజిస్ట్రేషన్లను రద్ధు చేసిన విషయం తెలిసిందే. సస్పెండైన సబ్ రిజిస్టార్ అఫ్జల్ నూర్ఖాన్ స్థానంలో కరీంనగర్ ఎస్ఆర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సదాశివ రామకృష్ణకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ కాగా, ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ విషయమై సబ్ రిజిస్టార్ అఫ్జల్ నూర్ఖాన్ ను ప్రశ్నించగా, సస్పెన్షన్ ఉత్తర్వులు నాకు ఇంకా అందలేదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -