Sunday, October 26, 2025
E-PAPER
Homeకరీంనగర్మద్యం టెండర్లలో గంగాధర వైన్స్ లే టాప్.!       

మద్యం టెండర్లలో గంగాధర వైన్స్ లే టాప్.!       

- Advertisement -
  • – జిల్లా టాప్ 10 లో 4 వైన్స్ లు
    – వైన్స్ లు దక్కించకోవడానికి పెరిగిన పోటీ
    నవతెలంగాణ – గంగాధర
    ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల టెండర్లలో కరీంనగర్ జిల్లాలోనే గంగాధర మండలంలోని వైన్స్ లకే అధిక టెండర్లు దాఖలు అయ్యాయి. మండలంలోని మధురానగర్ చౌరస్తాలో 2 వైన్స్ లు ఉండగా, గర్శకుర్తి, బూర్గుపల్లి గ్రామాల్లో ఒక్కో వైన్స్ చొప్పున మండలంలో మెుత్తం 4 వైన్స్ లు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో మెుత్తం 94 వైన్స్ లకు ప్రభుత్వం టెండర్లు పిలవగా, మెుత్తం 2730 దరఖాస్తులు టెండర్ల రూపంలో దాఖలు అయ్యాయి. వీటిలో గంగాధర మండలంలోని 4 వైన్స్ లకు అధిక టెండర్లు దాఖలై జిల్లాలోనే టాప్ 10 లో నిలిచాయి. మధురానగర్ వైన్స్-1 దుకాణానికి 47 టెండర్లు, వైన్స్-2 కు 45, గర్శకుర్తి,  బూర్గుపల్లి ఒక్కో వైన్స్ కు 42 చొప్పున టెండర్లు దాఖలు అయ్యాయి.

    మండలంలోని గర్శకుర్తి, గంగాధర, గోపాల్ రావుపల్లి, బూర్గుపల్లితోపాటు పలు గ్రామాల యువకులు వైన్స్ లు చేజిక్కించుకోవడానికి చూపిన ఉత్సాహం వల్లే గంగాధర మండలంలోని మద్యం దుకాణాలకు అధిక టెండర్లు దాఖలు అయ్యాయనే విషయం చర్చానీయాంశంగా మారింది. మద్యం దుకాణాలు దక్కించుకోవడానికి, ఎక్కువ టెండర్లు వేసేలా ఒక్కో గ్రూపులో 30 మందికి తక్కువ కాకుండా పార్టునర్స్ గా చేరి టెండర్లు వేశారు. దీంతో మండలంలోని మద్యం దుకాణాలకు పోటీ పెరిగి టెండర్లు ఎక్కువ దాఖలు అయ్యాయనే చర్చ కొనసాగుతోంది. తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి గంగాధర మండలంలోని 4 మద్యం దుకాణాలకు మొత్తం 176 టెండర్లు దాఖలు కాగా, ఇందులో సుమారు 100 టెండర్లను 3 కోట్ల రూపాయలు వెచ్చించి స్థానిక యువకులే వేశారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -