నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో పాక్ టీం నాకౌట్‌లోనే నిష్కమించింది. లీగ్ దశలో భారత్‌లో చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. ఆ జట్టు ప్రదర్శనతో ఇంటబయటా తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. అదే విధంగా ఇటీవల బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లో కూడా పాక్ టీం చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ ఇవ్వకుండా సిరీస్‌ను కోల్పోయింది. ఆ ప్రదర్శనతో ట్రోఫిలు గెలువలేరని. ట్రోఫిలను చోరీ చేయాలని ఆ దేశ క్రికెట్ మాజీ ఆటగాళ్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా పాక్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న గ్యారీ కిరిస్టెన్ కూడా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
జట్టులో లోపాలు సవరించేందుకు సరైనా ప్రణాళిక అమలు చేసినా..పలువురి అతి జోక్యంతో అవసరమైన ఫార్ములాను అమలు చేయడంలో ఇబ్బందులు పడ్డా. ఏం చేద్దామన్నా బయట నుంచి గోలపెడుతూనే ఉంటారు. జట్టు సరైన ప్రదర్శన లేని సమయంలో మేనేజ్‌మెంట్‌కు కనిపించే లక్ష్యం కోచ్. ఇలాంటి అనుభవాలను కేవలం ఆరు నెలల వ్యవధిలో ఎన్నో ఎదుర్కొన్నా. ఆరు నెలల వ్యవధిలో కోచ్‌గా అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నా. టీమ్ రాణిస్తున్నప్పుడూ కోచ్‌ను మార్చడం లేదా ఆంక్షలు విధించడం అత్యంత సులువైన పని. ఇలాంటప్పుడు కోచ్‌లను ఎందుకు నియమించుకోవడం?’’ అని కిరిస్టెన్ ప్రశ్నించాడు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు రెండేళ్ల కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ.. కేవలం ఆరు నెలలు మాత్రమే కోచ్‌గా చేసి గ్యారీ కిరిస్టెన్ రాజీనామా చేశారు. టీమ్‌ఇండియా 2011 వన్డే ప్రపంచ కప్ నెగ్గినప్పుడు కిరిస్టెన్ ప్రధాన కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.



