Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంవిశాఖ‌లో భారీ పేలుడు..చెల్లాచెదురుగా మృతదేహాలు

విశాఖ‌లో భారీ పేలుడు..చెల్లాచెదురుగా మృతదేహాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విశాఖ‌ ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురై గుర్తుపట్టని విధంగా మారిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. స్క్రాప్‌ దుకాణంలో వెల్డింగ్‌ చేసే సిలిండర్‌ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

సిలిండర్‌ పేలుడు క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌లో నగర సీపీ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి, ఇతర వైద్యులతో ఆయన మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీ కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img