నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడితో పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరి..యుద్ధానికి దారితీసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పీంకేలో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ వాయుసేన భీకర దాడులతో విధ్వంసం సృష్టించింది. ఆపరేషన్ సిందూర్ కు ముందు పాకిస్థాన్ దేశంపై దౌత్యపరంగా కఠిన చర్యలు తీసుకుంది భారత్ ప్రభుత్వం. ఈక్రమంలో 1960 కుదిరిన సింధూ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలివేసింది. అంతేకాకుండా సలాల్, బాగ్లీహార్ ప్రాజెక్టుల నుంచి ఆ దేశానికి చుక్కనీరు పోకుండా గేట్లు కూడా మూసివేసింది. దీంతో పాక్ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇటీవల సింధూ జలాల ఒప్పందాన్ని పునః సమీక్షించాలని పాక్ విదేశాంగ శాఖ ఇండియాన్ గవర్న్‌మెంట్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఉద్రవాదానికి పాక్ పూర్తిగా స్వస్తి పలికినప్పుడే ..సింధూ జలాలపై పునర్ ఆలోచిస్తామని భారత్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జమ్మూలోని రాంబన్- బాగ్లీహర్ హైడ్రో పవర్ ప్రాజెక్టు గేట్లు మరోసారి పూర్తిగా మూసివేశారు. మే 8న దేశ సరిహద్దు లో కురిసిన భారీ వర్షాలకు బాగ్లీహర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. తాజాగా రిజర్వాయర్ నీటిమట్టం సాధారణ స్థితికి చేరుకోవడంతో బాగ్లీహర్ ప్రాజెక్టు గేట్లు పూర్తి మూసివేశారు.
జమ్మూలో బాగ్లీహర్ రిజర్వాయర్ గేట్లు మూసివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES