నవతెలంగాణ-హైదరాబాద్: గాజాపై ఇజ్రాయిల్ దండయాత్రకు నేటి( 2025 అక్టోబర్ 7)తో రెండేళ్లు అవుతోంది. ఇజ్రాయిల్ మారణకాండకు లక్షల సంఖ్యలో అమాయక జనాలు మరణించారు. ఆ దేశ వైమానిక దాడులతో అనేక మందివిగతజీవులైయ్యారు. లక్షలమంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాంబుల పేలుళ్లకు అనేక భవనాలు నేలమట్టమైయ్యాయి. గాజా వ్యాప్తంగా ఎటు చూసినా శవాల దిబ్బలతో పాటు భవనాల శిథిలాలు దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా ఇజ్రాయిల్ విధ్వంసకాండకు గాజా నలువైపుల కాకవికాలమైంది. నిరంతర దాడులతో గాజాలో మరణ మృదంగం మోగించింది. చిన్నారులు ఆకలీ బాధలతో అలమటించి..తల్లుల వడిలో చానువు చాలించిన సంఘటనలు ప్రపంచ దేశాలను కలిచివేశాయి. వైమానిక దాడులతో ఇజ్రాయిల్ సృష్టించిన కరువు దాటికి గాజాలో సకలజనులు ఆకలి కేకలతో..ఆలమటించి తమ చానువు చాలించారు. అక్టోబర్ 7, 2023 నుంచి నేటి వరకు గాజాలో ఇజ్రాయిల్ ఊచకోత కొనసాగుతునే ఉంది.
ప్రపంచ దేశాలు గాజాలో ఇజ్రాయిల్ మారణకాండను ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఇటీవల జరిగిన ఐక్యరాస్యసమితి వార్షిక అసెంబ్లీ సమావేశాల్లో గాజాకు మద్దతుగా అనేక దేశాలు చేయి కలిపాయి. గాజా-ఇజ్రాయిల్ యుద్ధ ముగింపునకు రెండు దేశాల ఏర్పాటు సరైన పరిష్కారమని యూఎన్ జనరల్ మీటింగ్ లో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానానికి యూఎన్ సభ్యదేశాలు దాదాపుగా మద్దతుగా ఓటు వేశాయి. గాజాలో ఇజ్రాయిల్ తక్షణమే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశాయి. లేకపోతే కఠిన పరిణామాలు తీసుకుంటామని పలు దేశాలు హెచ్చరించాయి.
ప్రస్తుతం ట్రంప్ శాంతి ఒప్పందానికి 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. బందీలందరినీ ఒకేసారి విడుదల చేసేందుకు హమాస్ ఒప్పుకుంది. అలాగే పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. సోమవారం ఈజిప్టు వేదికగా శాంతి చర్చలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ బందీలను మాత్రం హమాస్ విడుదల చేయలేదు.