Tuesday, May 20, 2025
Homeతెలంగాణ రౌండప్క్రిస్టియనా మేడంకు కృతజ్ఞతలు తెలిపిన జిసిసి డైరెక్టర్

క్రిస్టియనా మేడంకు కృతజ్ఞతలు తెలిపిన జిసిసి డైరెక్టర్

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి 

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ  శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టియనా కు ఏటూర్ నాగారం ఐటిడిఏ, జిసిసి డైరెక్టర్ పులుసం పురుషోత్తం సరోజన లు సోమవారం మధ్యాహ్నం, రాష్ట్ర సచివాలయం హైదరాబాద్ లో కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు.   గత రెండు సంవత్సరాలుగా “లివర్ సంబంధిత వ్యాధి” తో  ఆరోగ్యం  పూర్తిగా క్షిణించి బాధపడ్డాడు. ప్రైవేటు దావఖానా లో ” లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ” ఆపరేషన్ కొరకు   సుమారుగా 30 నుండి 40లక్షలు ఖర్చు  పెట్టు కోలేక  క్రిస్టియనా మేడం గారి సలహాలు, సహకారం తో మరియు ఆదివాసుల పట్ల క్రిస్టిన మేడమ్ గారికి  ఉన్న ఆదర అభిమానము  మమకారం తో , తెలంగాణ ప్రభుత్వం  ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం తో నే  ” లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ” ఆపరేషన్ విజయవంతం అయింది. ఇప్పుడు డైరెక్టర్ పులుసం పురుషోత్తం ఆరోగ్యంగా ఉన్నారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొరవతో   ప్రాణాలు కాపాడబడ్డాయాని పురుషోత్తం భార్య సరోజన, పురుషోత్తం లు క్రిస్టియన మేడమ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు. అంతేకాకుండా నిమ్స్ హాస్పిటల్  యందు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ కు సహకరించిన డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారికి, ఆపరేషన్ చేసిన డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ సుకన్య, డాక్టర్ రామ చందర్ నిమ్స్ హాస్పిటల్ బృందానికి, ఆర్థికంగా సహకరించిన మిత్రులు శ్రేయోభిలాషులు  బంధువులు, రెసిడెన్షియల్  పాఠశాల పూర్వ  విద్యార్థులు గురువులు, అందరికి ధన్యవాదములు తెలిపారు. జీవితాంతం వారికే రుణపడి ఉంటామని పులుసు పురుషోత్తం, బార్య సరోజన లు తెలియజేశారు.వారి వెంట పిసా కమిటీ జిల్లా అధ్యక్షులు కొమరం ప్రభాకర్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -