సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘గేదెల రాజు’. కాకినాడ తాలూకా అనేది ట్యాగ్‌లైన్. ‘చూస్తే ఒకటే నిజం. చూడకపోతే వంద అనుమానాలు’ అనే ఒక నిజాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు చిత్రయూనిట్. శుక్రవారం రఘు కుంచె జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో ఎంతో ఫెరోసియష్‌గా కనిపిస్తున్నారాయన. మోటూరి టాకీస్ పతాకంపై రఘుకుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. ‘వైవిధ్యమైన చిత్రాలతో, పాటలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్న రఘు కుంచె ఈ చిత్రంలోనూ భిన్న పాత్రను పోషించారు. అంతేకాదు ఈ పాత్ర ప్రేక్షకులందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్రకు మంచి పేరు, గుర్తింపు వస్తుంది. టైటిల్, కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా సాగే కథ, కథనాలు అలరిస్తాయి. పవర్‌ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కిస్తున్న ఇటువంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది’ అని మేకర్స్ తెలిపారు. రవిఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక తది తరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు : రవిఆనంద్ చిన్నిబిల్లి, తాడాల వీరభద్రరావు, గీతార్థ్ కుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ తాత పూడి, దివ్య మోటూరి, లిరిక్స్ : గిరిధర్ రాగోలు, లలిత కాంతారావు, ఎడిటర్: సుధీర్ ఎడ్ల, ఆర్ట్ : అమర్ తలారి, సంగీతం : రఘు కుంచె, నిర్మాత: వాణి రవికుమార్ మోటూరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే దర్శకత్వం: చైతన్య మోటూరి.
‘గేదెలరాజు.. కాకినాడ తాలూకా’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES