నవతెలంగాణ-హైదరాబాద్: అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF)లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు గీతా గోపీనాథ్ వెల్లడించారు. ఈ మేరకు గోపీనాథ్ ఎక్స్‌లో పోస్టు చేసింది. తిరిగి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా వెళ్తున్నట్లు ప్రకటించారు. ఐఎంఎఫ్‌లో దాదాపు 7 సంవత్సరాలు పని చేశారు. అయితే తన సొంత గూటికే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
గీతా గోపీనాథ్.. భారతీయ-అమెరికన్ ఆర్థికవేత్త. గోపీనాథ్ 2019లో ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకనామిస్ట్‌గా చేరారు. ఐఎంఎఫ్‌లో మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేయక ముందు ఐఎంఎఫ్‌లో ముఖ్య ఆర్థికవేత్తగా పని చేశారు. 2022లో మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఐఎంఎఫ్ చరిత్రలో తొలి మహిళా చీఫ్ ఎకనామిస్ట్‌గా గీతా గోపీనాథ్ హిస్టరీ సృష్టించారు. అనూహ్యంగా ఐఎంఎఫ్ నుంచి నిష్క్రమిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి హార్వర్డ్ ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేయనున్నారు.
ఇక గోపీనాథ్ ఐఎంఎఫ్‌లో చేరకముందు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 2005-22 వరకు ఆర్థిక శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేశారు. అలాగే చికాగో విశ్వవిద్యాలయంలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో (2001-05) ఆర్థిక శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.