Sunday, July 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగీత వృత్తిదారులకు ఉపాధి కల్పించాలి

గీత వృత్తిదారులకు ఉపాధి కల్పించాలి

- Advertisement -

ప్రమాదాల నివారణకు
చర్యలు చేపట్టాలి
వచ్చే నెల రెండు నుంచి అమరుల యాదిలో
సామాజిక చైతన్యయాత్ర : కల్లుగీత కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గీత వృత్తిదారులకు ఉపాధి కల్పించి, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గీత కార్మికుల వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. వీరిని ప్రోత్స హించి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. బడా పెట్టుబడిదారులు తయారు చేస్తున్న లిక్కరు, థమ్సప్‌, కోకో కోలా లాంటి శీతల పానీయాల వల్ల కల్లు అమ్మకాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆ పానీయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నాయని ప్రశ్నించారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రకృతి పానీయాన్ని అందిస్తున్న లక్షలాదిమంది గీత కార్మికుల జీవనోపాధి పట్ల నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. కొంతమంది వ్యాపారులు కల్తీ కల్లును అమ్ముతున్నారనే నెపంతో మొత్తం కల్లు పైనే దుష్ప్రచారం చేయటం తగదని హితవు పలికారు. కల్తీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. ఆ పేరుతో మొత్తం వృత్తినే దెబ్బతీసే చర్యలు చేపడితే వృత్తిదారులు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించా రు. వృత్తిలో ప్రమాదానికి గురైన 710 మందికి ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా రూ.12.96 కోట్లను ఎందుకు విడుదల చేయటం లేదని నిలదీశారు. బాధితులంతా నిరాహార దీక్షలకు పూనుకున్నా.. సర్కారులో చలనం రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వృత్తి చేసే వారందరికీ వెంటనే కాటమయ్య రక్షణ కవచాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నందనంలో నీరా, తాటి, ఈత ఉత్పత్తుల కేంద్రం ప్రారంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నీరా కేఫ్‌కు టెండర్‌ వేయటం ద్వారా వచ్చే ఆదాయాన్ని గీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని సూచించారు.
ఇలాంటి డిమాండ్లన్నింటిపై వచ్చే నెల రెండు నుండి 18 వరకు అమరుల యాదిలో సామాజిక చైతన్య యాత్ర రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వి వెంకట నరసయ్య, ఏలుగురి గోవిందు, బాల్నే వెంకట మల్లయ్య, పామనుగుల్లా అచ్చాలు, కార్యదర్శులు బూడిద గోపి, చౌగోని సీతారాములు, ఎస్‌ రమేష్‌గౌడ్‌, బండ కింది అరుణ్‌, మడ్డి అంజిబాబు, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -