Sunday, May 4, 2025
Homeఅంతర్జాతీయంఆస్ట్రేలియాలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు..

ఆస్ట్రేలియాలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: ఇవాళ‌ ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్‌ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికల్లో 18 మిలియన్ల ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఈ ఎన్నికల్లో లెఫ్ట్‌ లేబర్‌ పార్టీనే గెలిచే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అక్కడ లెఫ్ట్‌ లేబర్‌ పార్టీనే అధికారంలో ఉంది. ప్రధానిగా ఆంథోని అల్బనీస్‌ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షనేత లిబరల్‌ నేషనల్‌ పార్టీ నేత పీటర్‌ డటన్‌కి, ప్రస్తుత ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కే మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ 52.5 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని, లిబరల్‌ నేషనల్‌ పార్టీకి 47.5 శాతం మేర ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని పలు సర్వేలు వెల్లడించాయి. ఆస్ట్రేలియా పార్లమెంటులో 150 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 76 సీట్లు అవసరం. వామపక్ష భావజాలమున్న లేబర్‌ పార్టీ, మితవాద లిబరల్‌ నేషనల్‌ పార్టీలదే ఆస్ట్రేలియా రాజకీయాల్లో చాలాకాలంగా ఆధిపత్యం. ప్రధాన అభ్యర్థులుగా ఆల్బనీస్, లిబరల్‌ పార్టీ సారథి డట్టన్‌ బరిలో ఉన్నారు. వారితో పాటు పలువురు స్వతంత్రులు కూడా పోటీ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -