Friday, May 16, 2025
Homeజాతీయంజులై 9కి సార్వత్రిక సమ్మె వాయిదా

జులై 9కి సార్వత్రిక సమ్మె వాయిదా

- Advertisement -

– కేంద్ర కార్మిక సంఘాల నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

మే 20న జరగాల్సిన కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె జులై 9 నాటికి వాయిదా పడింది. గురువారం నాడిక్కడ కేంద్ర కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. దేశంలోని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించారు. దేశం ఇంత తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం లేబర్‌ కోడ్‌ల అమలును దూకుడుగా ముందుకు తీసుకెళ్తోందని విమర్శించారు. పని గంటలను పెంచుతోందని, కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తోందని కేంద్ర కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. జులై 9న సార్వత్రిక సమ్మెను నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. దీనిపై యజమానులు, అధికారులకు అవసరమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. మే 20న పని ప్రదేశం, స్థానిక, జిల్లా స్థాయిల్లో సమీకరణలు జరగాలని సూచించారు. ప్రజల్లో సమ్మె ప్రచారాలను కొనసాగించాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -