నవతెలంగాణ-హైదరాబాద్: జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, పీఎం మోడీ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఇండియా పర్యటన నేపథ్యంలో జర్మనీ చాన్సలర్ రెండు రోజులు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్ లోని సబర్మతీ రీవర్ పోర్టులో నిర్వహించిన అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ప్రధాని మోడీతో కలిసి ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత ఇరువురు నేతలు కలిసి కాసేపు సరదగా కైట్ ఎగరేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అంతర్జాతీయ పతంగుల ఉత్సవం మూడు రోజుల పాటు కొనసాగునుంది. జనవరి 14న ముగియనుంది.ఈ కార్యక్రమంలో 50 దేశాలకు చెందిన 135 మంది అంతర్జాతీయ పతంగుల ఔత్సాహికులు పాల్గొంటారు. వారితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 65 మంది ఫ్లైయర్లు, గుజరాత్ నుండి 871 మంది పాల్గొంటారు.
రెండు రోజుల అధికారిక పర్యటన కోసం జర్మన్ ఫెడరల్ ఛాన్సలర్ ఇవాళ భారత్‌కు వచ్చారు. గుజరాత్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఛాన్సలర్ మెర్జ్‌ను.. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ విమానాశ్రయంలో సాదరంగా స్వాగతించారు.



