Sunday, January 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభార‌త్‌కు రానున్న‌ జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్

భార‌త్‌కు రానున్న‌ జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఎల్లుండి(జ‌న‌వ‌రి 12న) గుజ‌రాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగ‌నున్నార‌ని భార‌త్ విదేశాంగ శాఖ పేర్కొంది. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కైట్ ఫెస్టివ‌ల్, స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మం, దండి ప్రాంతాన్ని సంద‌ర్శించున్నారు. ఆ త‌ర్వాత జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్, ప్ర‌ధాని మోడీ భేటీ కానున్నారు. విద్యా, సాంకేతిక ప‌రిజ్ఞానం, వివిధ రంగాల్లో ఇరుదేశాల పెట్టుబ‌డుల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఇటీవలే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని ఇద్దరు నాయకులు సమీక్షిస్తారు. ఆ తరువాత ఇరునేత‌లు కలిసి మహాత్మా మందిర్‌లో సంయుక్త‌గా పత్రికా ప్రకటనలు విడుదల చేస్తారు.

జనవరి 13న, మెర్జ్ బాష్‌ను సందర్శించి, ఆ తర్వాత నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్, CeNSEని సందర్శించి, ఆపై జర్మనీకి బయలుదేరుతారు. గ‌త ఏడాది నవంబర్ 22న G20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ, మెర్జ్ సమావేశమయ్యారు. తాజా ప‌ర్య‌ట‌న‌తో ఇరు దేశాల నేత‌లు ద్వైపాక్షిక సంబంధాల‌ను బ‌లోపేతం చేయ‌నున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -