Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అశోక్ తేజకు పుస్తకాలను అందజేసిన గఫూర్ శిక్షక్

అశోక్ తేజకు పుస్తకాలను అందజేసిన గఫూర్ శిక్షక్

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి : ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ ఉత్తమ గీత రచయిత పురస్కార గ్రహీత సుద్దాల అశోక్ తేజకు కామారెడ్డికి చెందిన ప్రముఖ కవి తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ తాను రచించిన రచనలు ధైర్య కవచం, యుద్ధగీతం పుస్తకాలను ఆత్మీయంగా అందజేశారు. ఆదివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో సాయంత్రం 6 గంటలకు ప్రముఖ కవి గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ చలనకాంక్ష  పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా  గఫూర్ శిక్షక్ సుద్దాల అశోక్ తేజను కలిసి తన పుస్తకాలను అందజేశారు. సినిమా పాటలు, కవిత్వం గురించి చర్చించారు. కవిత్వ పుస్తకాలు బాగున్నాయని అశోక్ తేజ తనను అభినందించినట్లు గఫూర్ శిక్ష తెలిపారు. అతనితోపాటు కౌడి రవీందర్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad