Wednesday, December 31, 2025
E-PAPER
Homeజాతీయంగిగ్ వర్కర్లు సమ్మె..స్తంభించిన ఆన్‌లైన్ డెల‌వ‌రీలు

గిగ్ వర్కర్లు సమ్మె..స్తంభించిన ఆన్‌లైన్ డెల‌వ‌రీలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెతో ఆన్‌లైన్ పుడ్ డెల‌వ‌రీలు స్తంభించిపోయాయి. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు చెందిన గిగ్ వర్కర్లు సమ్మెలోకి పాల్గొన్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) మరియు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT) ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో కొన్ని యూనియన్లు కూడా దీనికి మద్దతు ఇచ్చాయి.

పని గంటలు పెరుగుతున్నప్పటికీ, ఆదాయం క్రమంగా తగ్గుతోందని కార్మికులు చెబుతున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, ప్రమాద బీమా, గౌరవం, భద్రత లేకపోవడం వంటి ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు. భారత డిజిటల్ మార్కెట్‌కు వెన్నెముకగా నిలిచే డెలివరీ భాగస్వాములకు కంపెనీలు తగని ప్రాధాన్యత కల్పించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -