- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్ గ్రామంలో గల మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాల భవనం నాల్గవ అంతస్తు నుండి ఐదో తరగతి చదవుతున్న సంధ్య (10) అనే బాలిక దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్ధిని మహబూబ్ నగర్ జిల్లా విఠలపురం గ్రామస్థురాలు. నిన్న ఉదయం అమ్మాయిని హాస్టల్లో పంపిన తల్లిదండ్రులు రాత్రి స్టడీస్ తర్వాత భవనంపై దూకి చనిపోయింది. తెల్లవారుజామున వాచ్ మెన్ చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -